
– జవాన్ మృతి
– ఇసుక లారీ ఢీకొనడంతో CRPF వాహనం బోల్తా.. మరో ఇద్దరు జవాన్లకు గాయాలు
– లారీ డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ప్రమాదానికి కారణమా?
ములుగు: అక్టోబర్ 08 (తొలిఅడుగు న్యూస్) ప్రతినిధి వినోద్ వేల్పుల
పస్రా: పస్రా–తాడ్వాయి ప్రధాన రహదారిపై అటవీశాఖ చెక్‌పోస్ట్ సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇసుక లారీ, CRPF జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఒక జవాన్ మృతి చెందగా, మరో ఇద్దరు జవాన్లు గాయపడినట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన సమయంలో అదే మార్గంలో పస్రా వైపు వెళ్తున్న మరో కారు కూడా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇసుక లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. మృతిచెందిన జవాన్ వివరాలు, క్షతగాత్రుల పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.








