72వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
చేవెళ్ల :అక్టోబర్ 04 (తొలిఅడుగు న్యూస్) ప్రతినిధి శ్రీపాల్.
సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ
ప్రజా సేవే పరమావధిగా భావించి, ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన స్వర్గీయ *పట్లోళ్ల ఇంద్రారెడ్డి* సేవలు చిరస్మరణీయం.
“కాలం మారినా… ఆయన జ్ఞాపకాలు చెరిగిపోవు.
ప్రజల కోసం ఆయన వేసిన అడుగులు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే.”
స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి 72వ జన్మదినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి చేవెళ్ల, కౌకుంట్లలోని స్వర్గీయ ఇంద్రారెడ్డి సమాధి వద్ద మరియు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం పలుచోట్ల కేక్ కట్ చేసి స్వర్గీయ ఇంద్రారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని *“ఇంద్రన్న అమర్ రహే”* అంటూ నినాదాలతో ప్రాంతాలను మారుమోగించారు.
తన భర్త స్వర్గీయ ఇంద్రారెడ్డి ఆశయాలను స్మరించుకుంటూ, ఆయన చూపిన ప్రజాసేవా మార్గంలో ముందుకు సాగుతున్న సబితా ఇంద్రారెడ్డి, ప్రతి ఏడాది ఆయన జయంతిని ఘనంగా నిర్వహిస్తూ ఆయన జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతున్నారు.
ఈ కార్యక్రమంలో తంగడపల్లి మాజీ సర్పంచ్ అనూష సత్తయ్య గౌడ్ Ex మాజీ సర్పంచ్ షాబాద్ రాములు గౌడ్ గోపాల్ రెడ్డి చంద్రయ్య గౌడ్ సుధాకర్ గౌడ్ నయీమ్ ఖాన్ జాకీర్ హనుమంత్ శ్రీపాల్ ఇంద్రరెడ్డి అభిమానులు ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు








