మహిళలకు రోటరీ క్లబ్ స్వయం ఉపాధి ప్రోత్సాహం..

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టుమిషన్ పంపిణీ

అధ్యక్షులు షేక్ అజీమ్, కార్యదర్శి పాపినేని శ్రీనాథ్ రాజేష్, కోశాధికారి కొత్త రామకృష్ణ

భద్రాచలంటౌన్:నవంబర్22(తొలిఅడుగున్యూస్)

మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదిగి, తమ కాళ్లపై తాము నిలబడాలనే లక్ష్యంతో రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కుట్టుమిషన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోటరీ కమ్యూనిటీ అండ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులకు క్లబ్ అధ్యక్షులు షేక్ అజీమ్, కార్యదర్శి పాపినేని శ్రీనాథ్ రాజేష్, కోశాధికారి కొత్త రామకృష్ణ కుట్టుమిషన్‌ను అందజేశారు.

ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి, వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సమాజ సేవలో రోటరీ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని, పేద మరియు నిరుపేద మహిళల అభ్యున్నతికి, స్వయం ఉపాధి కల్పనకు భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు ప్రభాకర్ గుప్తా, ఆర్. బాలాజీ, రాజారెడ్డి, రఫీ, మధు, చైతన్య, వరలక్ష్మి, సాగర్, రమేష్, శంకర్ రెడ్డి, రాజశేఖర్, ప్రసన్న, చలపతి, నరసింహారావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :