భద్రాచలంలో శాంతియుత నిరసన ర్యాలీ

తెల్లం శరత్‌కు న్యాయం చేయాలంటూ కొవ్వొత్తుల ప్రదర్శన..!

నవంబర్ 21న భద్రాచలం బంద్‌కు ఆదివాసీ జేఏసీ పిలుపు

భద్రాచలంటౌన్ :నవంబర్20(తొలిఅడుగున్యూస్)

తెల్లం శరత్ మృతికి న్యాయం చేయాలనే డిమాండ్‌తో భద్రాచలంలో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. శ్రీ సత్యసాయి రెసిడెన్సీ ఎదుట మృతుడు తెల్లం శరత్ చిత్రపటాన్ని ఉంచి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా శరత్ మృతిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో నవంబర్ 21, శనివారం భద్రాచలం పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. శరత్‌కు న్యాయం జరిగే వరకు తమ నిరసన కొనసాగుతుందని పేర్కొంటూ, బంద్‌కు వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులు, ప్రజలు, అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా సహకరించి బంద్‌ను విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు.
శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ న్యాయం కోసం ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :