రింగ్ రోడ్డు సెంటర్‌లో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాల ఏర్పాటుకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చొరవ
అశ్వారావుపేట:నవంబర్13(తొలిఅడుగు న్యూస్)
అశ్వారావుపేట: రింగ్ రోడ్డు సెంటర్‌లోని హైస్కూల్ సమీపంలో మాజీ ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల విగ్రహాలను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు పాల్గొన్నారు.
విగ్రహాల ఏర్పాటుకు అనువైన స్థలాన్ని పరిశీలించి, ఏర్పాట్లపై వారు చర్చించారు. ప్రజలకు, భావితరాలకు జాతీయ నాయకుల సేవలు, త్యాగాలు గుర్తుండేలా విగ్రహాల ఏర్పాటు చేపట్టనున్నట్లు ఈ పరిశీలన ప్రాధాన్యతను సంతరించుకుంది.
Post Views: 169








