బీసీఎం ప్రెస్ క్లబ్ అండ్ మీడియా డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నిక.

భద్రాచలంలో నూతన ప్రెస్ క్లబ్ ఏర్పాటు

అధ్యక్షుడిగా అన్నెం సుధీర్..కార్యదర్శిగా భూక్య సాయి కౌశిక్ ఏకగ్రీవ ఎన్నిక

భద్రాచలంటౌన్,నవంబర్24(తొలిఅడుగున్యూస్):

భద్రాచలం పట్టణంలో పాత్రికేయుల ఐక్యత, సంక్షేమం, హక్కుల పరిరక్షణే లక్ష్యంగా బీసీఎం ప్రెస్ క్లబ్ అండ్ మీడియా డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం నాడు నూతన ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా అన్నెం సుధీర్, కార్యదర్శిగా భూక్య సాయి కౌశిక్‌తో పాటు మరో 13 మంది కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. పాత్రికేయుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం నూతన ప్రెస్ క్లబ్ నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి, వాటి పరిష్కారం కోసం నిరంతరాయంగా పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు.

ఇటీవలి కాలంలో జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో విలేకరులందరూ రాజకీయాలు, వ్యక్తిగత విభేదాలకు అతీతంగా ఐక్యంగా నిలబడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని, ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

విధి నిర్వహణలో జర్నలిస్టులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాలను రూపొందించాలని, పాత్రికేయుల భద్రతకు, సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రెస్ క్లబ్ ఒక వేదికగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో దారిశెట్టి సతీష్ బాబు, యాకూబ్ మియా, బి. సందీప్, పి. ప్రసాద్, ఎం. శ్రీనివాస్, ఆర్. వెంకటేశ్వర్లు (వెంకట్), జి. సాంబశివ, ఎండి బాబాజీ, సురేష్, బి. భరత్, జి. శేఖర్ రెడ్డి, బి. రంగా, కె. అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నూతన అధ్యక్ష, కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకుని అభినందనలు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :